Breaking News

రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రూ.1500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Wed, 04/17/2024 - 07:55

ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ మూవీ డ్యూన్ పార్ట్- 2 ఓటీటీలోకి వ‌చ్చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రం అందుబాటులో ఉంది. 

ప్రస్తుతం రెంట‌ల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్డెజ్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా.. లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందించారు. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా  పార్ట్- 2 తీసుకొచ్చారు.  మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)