ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు
Breaking News
'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్
Published on Sat, 09/05/2026 - 08:29
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అంటే చాలామంది 'డిసి' అని చెబుతారు. తెలుగులో అయితే జీరో ప్రమోషన్స్ చేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇందులో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి దక్షిణాదిలో ఓవర్‌నైట్ స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడదే ఊహించని అవకాశం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలతో చాన్నాళ్ల తర్వాత వరస హిట్స్ అందుకున్న సూర్య ప్రస్తుతం నజ్రియాతో కలిసి మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌తో ఓ మూవీ చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ జ్ఞాన వేల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇకపోతే సూర్య 49వ చిత్రం 'జన నాయగన్' ఫేమ్ దర్శకుడు హెచ్.వినోద్ తీయనున్నాడట.
ఈ మూవీలోనే హీరోయిన్గా లేటెస్ట్ సెన్సేషన్ వామిక గబ్బిని అనుకుంటున్నారట. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సూర్య 'కరుప్పు'కు సాయినే సంగీతమందించాడు. దీని అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.
Tags : 1