Breaking News

వడ్డే నవీన్‌ ఎంత పవర్‌ఫుల్‌ అంటే.. వినాయక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 06/13/2026 - 11:06

వడ్డే నవీన్‌.. 90వ దశకంలో ఆయన స్టార్‌ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరేట్‌ హీరో ఇతనే. 2000వ సంవత్సరం వరకు వరుస సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత యంగ్‌ హీరోలు రావడంతో ఈ ఫ్యామిలీ హీరో వెనక్కి తగ్గాడు. చివరగా ఆర్జీవీ ఎటాక్‌ (2016) సినిమాలో నటించాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కి స్టార్‌ డైరెక్టర్‌ వి.వి వినాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నవీన్‌ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకుంటూ..ఆయన ఎంత పవర్‌ఫుల్లో వివరించాడు.

నవీన్‌ హీరోగా చేసిన ఒక సినిమాకు వినాయక్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడట. ఆయన ప్రోత్సాహంతోనే డైరెక్టర్‌ని ఆయ్యానని..ఆది సినిమాకు నాంది నవీనే అంటున్నాడు. ‘నవీన్‌తో కలిసి ఒకే ఒక్క సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశా కానీ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చేసిన సినిమాల్లో 90శాతం కంటే ఎక్కువగా ఇష్టం లేకుండానే చేసేశాడు. ఓ సారి నేను ఓ సీన్‌ రాశా..అది చూసి ఇది ఎవరు రాశారని అడిగారు. నేను డైరెక్షన్‌ టీమ్‌ అని చెప్తా.. కానీ నేనే రాశానని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి భోజనానికి పిలిచాడు. అప్పుడే ఇక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయడం ఆపేసి..డైరెక్షన్‌ చేయమని చెప్పాడు. నీకు నేను తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే డైరెక్టర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆయన సినిమాకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడే  జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను స్విట్జ‌ర్లాండ్లో క‌లిశా. అలా ఆది సినిమాకు నవీన్‌ సినిమా నాందిగా నిలిచింది’ అని వినాయక్‌ చెప్పాడు.

ఇక నవీన్‌ ఎంతపవర్‌ఫుల్లో వివరిస్తూ.. ‘ఆయన సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని విమానంలో స్విట్జ‌ర్లాండ్‌ నుంచి ఇండియాకు వస్తుంటే ఒక కాస్ట్యూమర్‌ సిగరేట్‌ కాల్చారు. అది భద్రతా సిబ్బందికి తెలిసి..చెన్నైలో అడుగుపెట్టగానే ఏకే 47 గన్లతో వచ్చి ఆ కాస్ట్యూమ‌ర్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం నవీన్‌ దగ్గరకు వెళ్లగానే.. ఒక ఫోన్‌ కాల్‌ చేసి నిమిషాల్లో విడిపించాడు. అప్పుడు ఈయ‌న అంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇంత ప‌వ‌ర్ ఫుల్లా అని ఆశ్చ‌ర్య‌పోయాను’ అని వినాయ‌క్ అన్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)