Breaking News

చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

Published on Wed, 01/24/2024 - 09:45

బడా సినిమాల కంటే చిన్న చిత్రాలకే ఓటీటీల బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అటు థియేటర్లు దొరికేవి కావు, ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే టీవీల్లోనూ పెద్దగా వేసేవారు కాదు. కానీ ఇప్పుడలా కాదు. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్సులు ఇస్తున్నాయి. దీంతో సినీ ప్రేమికులు.. చిన్న చిత్రాలని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడలా రెండు తెలుగు సినిమాలు చాలారోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

తెలుగులో గతేడాది వచ్చిన ఓ ప్రేమకథా సినిమా 'ప్రేమిస్తే చచ్చేది మేమే'. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి ఈ చిత్రం వచ్చేసింది. పూర్తిగా నిబ్బానిబ్బీ తరహా కథతో ఈ చిత్రాన్ని తీశారు. ఓ ధనవంతులైన అమ్మాయి, ఆటో నడుపుకొనే కుర్రాడు ప్రేమలో పడితే.. చివరకు ఏమైందనేదే స్టోరీ. కథ పరంగా ఓకే కానీ బడ్జెట్ పరిమితి అనేది స్క్రీన్‌‌పై స్పష్టంగా కనిపించింది.

గతేడాది అక్టోబరు చివర్లో వచ్చిన మరో తెలుగు సినిమా 'ఓటు'. టైటిల్‌కి తగ్గట్లే ఓటు విలువ చెప్పే ఈ చిత్రం కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో జనాలకు పెద్దగా తెలియదు. పేరున్న నటీనటులు కూడా మూవీలో ఎవరూ లేరు. దీంతో ఈ చిత్రం అలా థియేటర్లలోకి వచ్చి ఇలా వెళ్లిపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజైంది. ఒకవేళ ఏదైనా తెలుగు మూవీస్ చూస్తూ టైంపాస్ చేయాలనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు.

(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)