Breaking News

షూటింగ్‌లో వీజే సన్నీకి గాయాలు, బుల్లెట్‌ తగలడంతో..

Published on Sat, 05/13/2023 - 07:58

బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ షూటింగ్‌లో గాయపడ్డాడు. సినిమా రిలీజ్‌ డేట్‌కు సంబంధించి స్పెషల్‌ ప్రోమో షూట్‌ చేసే క్రమంలో అతడికి గాయాలయ్యాయి. సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్‌స్టాపబుల్‌. నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రజిత్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఓ ప్రోమో షూట్‌ నిర్వహించింది.

ఇందులో పోలీస్‌ గెటప్‌లో ఉన్న సప్తగిరి అన్‌స్టాపబుల్‌ రిలీజ్‌ ఎప్పుడు? అని గన్‌ పట్టుకుని పృథ్వీరాజ్‌ను బెదిరించాడు. ఇంతలో అటువైపుగా సన్నీ రావడంతో పృథ్వీ అతడిపైకి గన్‌ ఎక్కుపెట్టాడు. పొరపాటున అది పేలడంతో సన్నీకి బుల్లెట్‌ తగిలింది. అది డమ్మీ బుల్లెట్‌ అయినప్పటికీ సన్నీకి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఆ డమ్మీ గన్‌ను కావాలనే పేల్చారని, సన్నీకి ఏ గాయమూ కాలేదని, ఇదంతా మూవీ ప్రమోషన్‌ స్టంట్‌ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలోనూ సన్నీ డబ్బులు దొంగతనం చేసిన వీడియో వైరల్‌ అయింది. ఏటీఎమ్‌ వెబ్‌ సిరీస్‌ కోసం అలా స్టంట్‌ చేశాడని ఇట్టే పసిగట్టారు ఆడియన్స్‌. ఇకపోతే గతంలో సీరియల్స్‌లో నటించిన సన్నీ బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

చదవండి: మోడ్రన్‌ లవ్‌ చెన్నై.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)