Breaking News

నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక

Published on Fri, 06/13/2025 - 16:07

అమ్మతో పంచుకోలేనవి, నాన్నతో చెప్పుకోలేనివి, సోదరుడు/సోదరితో మాట్లాడలేనివి.. ఏవైనా సరే ఈ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. మొహమాటాలకు అస్సలు తావుండదు. అతడే ఫ్రెండ్‌.. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నమ్మి దోచుకునేవారికంటే నిజాయితీగా మసులుకునే ఫ్రెండ్‌ ఒక్కరున్నా చాలనుకునేవారు చాలామంది.

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌
మెగా డాటర్‌ నిహారిక (Niharika Konidela)కు అలా చెప్పుకునే స్నేహితులు ముగ్గురున్నారు. వారే వితికా షెరు, మహాతల్లి జాహ్నవి, అంబటి భార్గవి. ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. తాజాగా వితికా షెరు (Vithika Sheru).. నిహారికకు పెద్ద సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. తనకోసం ఏం చేయాలా? అని ఆలోచించగా ఓ మంచి ఐడియా తట్టింది. నిహారిక పాటరీ స్టూడియోను అందంగా మార్చేసింది. భార్గవితో కలిసి ఆ పాటరీ గదిలోని ఓ గోడకు రంగు వేసింది. తర్వాత అక్కడున్న వస్తువుల్ని కొన్ని తీసేయించి అందంగా సర్దింది. కొన్ని పూలమొక్కల్ని కూడా గదిలో అలంకరించింది.

నిహారికకు తెలియకుండా..
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పింది. నిహారిక, నేను ఒకే టీచర్‌ దగ్గర పాటరీ (మట్టి పాత్రలు తయారు చేయడం) నేర్చుకున్నాం. మేము ఫ్రెండ్స్‌ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం. నేను కుమ్మరి పనిలో బేసిక్స్‌ మాత్రమే వచ్చు. కానీ నిహారిక, భార్గవి డిగ్రీలు చేసేశారు అని చెప్పుకొచ్చింది. ఈ మేకోవర్‌ అంతా నిహారికకు తెలియకుండా చేసింది. తీరా ఆ పాటరీ స్టూడియోకు వచ్చిన నిహారిక.. తన గదిని అంత అందంగా మార్చిన వితికాను ముద్దులతో ముంచెత్తింది.

దిష్టి తగలొద్దు
వితికా చేసిన పనిని మెచ్చుకుంటూ నిహారిక సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. నీకు, నీ ప్రేమకు ఏ దిష్టీ తగలకూడదు. తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది. నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థాంక్యూ. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను. కానీ, నువ్వు చేసిన పని చూశాక నాపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలినైపోయాను. నువ్వెప్పుడూ నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్‌గా ఫీలయ్యేలా చేస్తావ్‌. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తావ్‌. దీన్ని నేను గ్రాంటెడ్‌గా తీసుకోను.. నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్యూ బేబీ..  అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. వితికా లాంటి ఫ్రెండ్‌ దొరకడం అదృష్టం అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: శూర్పణఖగా ప్రియాంక అవుట్‌.. రకుల్‌తో డీల్‌?

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)