Breaking News

చెల్లి సీమంతం గ్రాండ్‌గా చేసిన వితిక

Published on Sat, 11/08/2025 - 16:21

హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి వచ్చిన తెలుగమ్మాయి వితికా షేరు.. తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్‌ని తర్వాత కొన్నాళ్లకు పెళ్లిచేసుకుంది. మధ్యలో వీళ్లిద్దరూ కలిసి బిగ్‌బాగ్ 3వ సీజన్‪లో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఈ షో నుంచి వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు గానీ వితిక మాత్రం యూట్యూబ్‍‌లో వీడియోలు చేస్తోంది.

ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే విశేషాలని పంచుకునే వితికా షేరు.. తన చెల్లి క్రితిక సీమంతం చేసిన విషయాన్ని పంచుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలు, యూట్యూబ్‌లో ఈ శుభకార్యానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో వితిక కుటుంబంతో పాటు క్రితిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా కనిపించారు.

(ఇదీ చదవండి: ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన సాయికిరణ్‌)

'సీమంతం అనేది మహిళ జీవితంలో ఓ అందమైన సంప్రదాయ వేడుక. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు. అమ్మతనం, ప్రేమ అనే కొత్త ప్రారంభానికి ఇదో సెలబ్రేషన్' అని వితిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇకపోతే నెలన్నర క్రితం అంటే సెప్టెంబరు చివరి వారంలోనూ చెల్లికి సింపుల్‌గా బేబీ షవర్ (సీమంతం) చేసింది. అప్పుడు కేవలం స్నేహితురాళ్లతో దీన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకని జరుపుకొన్నారు.

చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్‌ ఫోటోలను సైతం షేర్‌ చేసింది. ఇప్పుడు సీమంతం జరిగింది.

(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)