Breaking News

విశ్వంభర స్పెషల్‌ సాంగ్‌లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Published on Mon, 07/28/2025 - 11:48

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్‌ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్‌ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.

తెలుగులో తొలిసారి..
సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్‌ ఉన్న స్పెషల్‌ సాంగ్‌ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్‌లో విలనిజం పండించిన మౌనీ రాయ్‌ను సెలక్ట్‌ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్‌లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. 

నిమిషానికి లక్షల్లో..
సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్‌ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్‌.. నాగిణి సీరియల్‌తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

విశ్వంభర ఆలస్యం?
నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్‌ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్‌ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్‌ఎక్స్‌ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్‌.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)