Breaking News

చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?

Published on Sun, 03/29/2026 - 17:03

స్టార్ హీరో అనే ట్యాగ్ లైన్.. సొంత ఇండస్ట్రీ, అభిమానుల వరకు పనికొస్తుందేమో గానీ మార్కెట్ లెక్కలు వచ్చేసరికి అవన్నీ మారిపోతుంటాయి. సక్సెస్ ట్రాక్ ఎలా ఉంది? ఏయే దర్శకులతో పనిచేస్తున్నారు? లాంటి లెక్కలు చాలా ఉంటాయి. ఇప్పుడు అలానే చిరంజీవి, ప్రభాస్ కొత్త చిత్రాలకు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. అందుకే రిలీజ్ డేట్స్‌పై మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?

(ఇదీ చదవండి: రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?)

చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ స్టోరీతో తీసిన ఈ సినిమాకు 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకుడు. రెండేళ్ల క్రితమే దీన్ని థియేటర్లలోకి తీసుకొద్దామని అనుకున్నారు. అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో లెక్కలన్నీ మారిపోయాయి. గ్రాఫిక్స్‌పై దారుణమైన విమర్శలు, ట్రోల్స్ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అదలా సాగుతూనే ఉంది. ఈ మూవీకి ఇప్పటివరకు ఓటీటీ డీల్ జరగలేదు. అందుకే విడుదల తేదీపై నిర్మాతలు తేల్చకోలేకపోతున్నారు.

దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టారని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఓ ఈవెంట్‌లో చెప్పారు. ఈ సినిమాకు ఓటీటీ రేట్ విషయంలో ఇంకా తర్జనభర్జనలు సాగుతూనే ఉన్నాయి. దీంతో ఈసారి వేసవిలోనూ థియేటర్లలోకి రావడం కష్టమే అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జూన్ 4 టాక్సిక్ ఉంది. 26వ తేదీన అఖిల్ 'లెనిన్' రిలీజ్ కానున్నాయి. ఆపై నెలల్లోనూ 'ప్యారడైజ్' లాంటి పెద్ద మూవీస్ లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చిరు చిత్రం.. ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని ఈ ఏడాదైనా వస్తుందా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. కొత్త టీజరో ట్రైలరో వచ్చి ఆకట్టుకుంటే తప్ప 'విశ్వంభర'పై ప్రేక్షకులు దృష్టిపడే అవకాశం లేదు.

ప్రభాస్ 'ఫౌజీ' చిత్రానికి కూడా ఇంకా ఓటీటీ డీల్ జరగలేదు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. ప్రభాస్ గత చిత్రం 'రాజాసాబ్' ఓటీటీలో అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మ్ చేసింది. అందుకే 'ఫౌజీ' విషయంలో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ మొత్తం రేటు ఆఫర్  చేస్తున్నాయట. లెక్క ప్రకారం ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ డిజిటల్ డీల్ సెట్ అవ్వకపోతే విడుదల కచ్చితంగా వాయిదా పడుతుంది. మరి చిరు, ప్రభాస్ మూవీస్ సమస్య పరిష్కారమైతే సరేసరి. లేదంటే మాత్రం ఈ రెండింటిని వచ్చే ఏడాది చూస్తాస్తేమో?

(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)