Breaking News

డార్లింగ్‌ విజయం సాధిస్తుంది: విశ్వక్‌ సేన్‌

Published on Mon, 07/08/2024 - 03:45

‘‘డార్లింగ్‌’ మూవీ ట్రైలర్‌ చాలా బాగుంది. డైరెక్టర్‌ రామ్‌ అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. ప్రియదర్శి, నభా నటేష్‌ జోడీగా అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్‌’. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వక్‌ సేన్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సమయంలో నన్ను వేదికపైకి ఆహ్వానించి సైకో వివేక్‌గా పరిచయం చేశాడు ప్రియదర్శి. ‘మల్లేశం, బలగం’ లాంటి సినిమాలు అందరికీ పడవు.. రాసి పెట్టి ఉండాలి. 

ఇప్పుడు తను ‘డార్లింగ్‌’ తో రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శి గెలిస్తే నేను గెలిచినట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డార్లింగ్‌ అనగానే ప్రభాస్‌అన్న పేరు గుర్తొస్తుంది. అలాంటి టైటిల్‌ పెట్టుకోవాలంటే భయంగా ఉండేది. అయితే కథని నమ్మి ‘డార్లింగ్‌’ టైటిల్‌ పెట్టుకున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘నేను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నపుడు ‘డార్లింగ్‌’ అవకాశం వచ్చింది’’ అన్నారు నభా నటేష్‌. ‘‘మూడేళ్ల ప్రయాణం ‘డార్లింగ్‌’. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇస్తుంది’’ అన్నారు అశ్విన్‌ రామ్‌. ‘‘కథని నమ్మి తీసిన ఈ మూవీకి ప్రేక్షకుల ్రపోత్సాహం కావాలి’’ అన్నారు చైతన్య. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)