అశ్విన్‌ కెరీర్‌లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్‌ సేన్‌

Published on Wed, 07/24/2024 - 00:35

‘‘శివం భజే’ ట్రైలర్‌ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్‌ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులు సక్సెస్‌ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్‌లో ‘శివం భజే’ నిలిచిపోతుంది’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది.

మంగళవారం జరిగిన ‘శివం భజే’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి విశ్వక్‌ సేన్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘శివం భజే’ ట్రైలర్‌ బాగుంది. యూనిట్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు అనిల్‌ రావిపూడి.

‘‘అశ్విన్‌ క్రికెట్‌లో బాల్‌ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి’’ అన్నారు తమన్‌. ‘‘పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అన్నారు అప్సర్‌. ‘‘ముస్లిం అయిన అప్సర్‌గారు ‘శివం భజే’ లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది’’ అని అన్నారు అశ్విన్‌బాబు.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)