Breaking News

మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక

Published on Wed, 03/26/2025 - 14:07

కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్‌ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్‌- మోహన్‌బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్‌కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు.  ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్‌బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu). 

ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్‌ అవుతున్నారు. భయపడిపోతున్నారు. 

నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్‌
అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్‌ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.

చదవండి: అర్ధరాత్రి ఫోన్‌.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)