Breaking News

ముద్దు సన్నివేశం.. డిలీట్‌ చేయమన్న తెలుగు హీరోయిన్‌

Published on Fri, 10/24/2025 - 12:37

కథ డిమాండ్‌ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైనా నటించేందుకు సిద్ధమే అంటుంటారు తారలు. కొందరు మాత్రం అసభ్యత, అశ్లీలతకు ఇసుమంత చోటు కూడా ఇవ్వని సినిమాలే చేస్తామంటారు. మరికొందరు మాత్రం మూడో కేటగిరీ.. ఫస్ట్‌ సీన్‌లో నటిస్తారు.. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని అది లేకపోయుంటే బాగుండంటూ లోలోనే మథనపడుతుంటారు. వారి ఇబ్బందిని గమనించి ఆయా సీన్లను ఎత్తేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

హీరోయిన్‌ అభ్యంతరం
హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal) ఇప్పుడదే పని చేశాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్‌. శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. ఈ మూవీ అక్టోబర్‌ 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. ఈ మూవీలో ఒక రొమాంటిక్‌ సాంగ్‌ ఉంది. అందులో ఒక ముద్దు సన్నివేశం షూట్‌ చేశాం. అంతా అయిపోయాక దానిపై మానస (Maanasa Choudhary) అభ్యంతరం చెప్పింది. ఆ సీన్‌ను తీసయమని దర్శకుడిని కోరింది.

కత్తిరించేశాం
అదే మాట డైరెక్టర్‌ నాకొచ్చి చెప్పాడు. తన ఇబ్బంది నాకర్థమైంది. సరే, ఆ సీన్‌ తీసేద్దాం.. అది లేకుండా డిఫరెంట్‌గా పాటను పూర్తి చేద్దాం అని చెప్పాను. సినిమా ఫైనల్‌ ఎడిటింగ్‌లో ఆ సన్నివేశాన్ని కత్తిరించేశాం అని చెప్పుకొచ్చాడు. మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరుకు చెందిన ఈ బ్యూటీ.. యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌గమ్‌ మూవీతో తెరంగేట్రం చేసింది. లక్కీ భాస్కర్‌ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఆర్యన్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.

చదవండి: ట్రెండింగ్‌లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్‌ ఇప్పుడెలా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)