Breaking News

విష్ణు విశాల్ ఆర్యన్.. అర్థం లేని క్లైమాక్స్.. దెబ్బకు కట్‌!

Published on Mon, 11/03/2025 - 22:19

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటేస్ట్ మూవీ ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్మూవీ ఇటీవలే తమిళనాడు థియేటర్లలో విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కించారు. కోలీవుడ్బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న చిత్రానికి తొలి రోజే మిక్స్డ్టాక్వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన సినిమా వసూళ్ల పరంగా అంతగా రాణించలేకపోతోంది.

అయితే మూవీలోని క్లైమాక్స్సీక్వెన్స్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. మూవీ క్లైమాక్స్లో విలన్సెల్వ రాఘవన్ నలుగురిని ఎందుకు చంపాడనేది సీన్తో సెట్కాలేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వేదికగా నిలదీశారు. సన్నివేశం స్క్రీన్‌ప్లేతో సరిపోలేదని ఆడియన్స్అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ఆర్యన్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూవీలో కీలకమైన క్లైమాక్స్చివరి పది నిమిషాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో సీన్లను తీసేసినట్లు తెలిపారు. రోజు నుంచి థియేటర్లలో సెల్వ రాఘవన్క్లైమాక్స్ సీన్స్కట్ చేసినట్లు వెల్లడించారు. కొత్త వెర్షన్ సోమవారం నుంచే థియేటర్లలోకి వస్తుందని ఆర్యన్ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ చిత్రంలోని పది నిమిషాల క్లైమాక్స్సీన్స్ తెలుగు వెర్షన్ నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ అక్టోబర్ 31న విడుదల చేయాలని భావించారు. కానీ రవితేజ మాస్ జతార, ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్‌ రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు. మూవీని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విష్ణు విశాల్ తన బ్యానర్లో నిర్మించారు. మూవీకి గిబ్రాన్ సంగీతమందించారు.

 

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)