Breaking News

'ఢీ'.. దిల్‌రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు

Published on Sat, 06/07/2025 - 17:19

సూపర్‌ హిట్‌ కామెడీ చిత్రాల్లో 'ఢీ: కొట్టి చూడు' ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2007లో వచ్చింది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఢీ మూవీ(Dhee Movie)ని నిన్న (జూన్‌ 6) రీరిలీజ్‌ చేశారు. రీరిలీజ్‌ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే ఢీని మాత్రం పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఆడియన్స్‌ లేక థియేటర్లు ఖాళీగా దర్శనిమస్తున్నాయి.

నా బర్త్‌డే రోజు ఫస్ట్‌ షో
అయితే ఢీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విష్ణు. కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రమోషన్స్‌లో విష్ణు మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య మనమంతా ఎక్స్‌ట్రార్డినరీ అనుకున్న సినిమాలు ఆడియన్స్‌కు రీచ్‌ అవకపోవచ్చు. కొన్నేమో రివర్స్‌లో జరుగుతాయి. 2006లో నా పుట్టినరోజైన నవంబర్‌ 23న ప్రసాద్‌ ల్యాబ్‌లో ఢీ ఫస్ట్‌ షో పడింది. తర్వాత అది 2007, ఏప్రిల్‌ 13న థియేటర్లలో విడుదలైంది.

ఆడటం కష్టమే..
ఈ మధ్యలో దాదాపు వంద షోలు ప్రసాద్‌ ల్యాబ్‌లోనే పడ్డాయి. దిల్‌రాజు సహా ఎంతోమంది.. ఈ సినిమా యావరేజ్‌, పెద్దగా ఆడదు.. కష్టం! అని డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చివర్లో నాన్న ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. తర్వాత మూవీ హిట్టయిన విషయం మీకు తెలిసిందే! అని విష్ణు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఢీ మూవీని మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించగా చక్రి సంగీతం అందించాడు.

చదవండి: 90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరో తల్లి!

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)