Breaking News

పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్‌ చేసిన తప్పు అదే!: విష్ణు

Published on Sat, 07/19/2025 - 16:55

సెలబ్రిటీలకు సమాజంలో ఉండే క్రేజే వేరు. సినీతారలు వస్తున్నారంటే వారిని చూసేందుకు జనం ఎగబడతారు. హీరో తాకినా, సెల్ఫీ ఇచ్చినా, చూసి నవ్వినా.. జన్మ ధన్యమైపోయిందన్నట్లుగా ఫీలవుతారు. కానీ, ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు అసలుకే ఎసరు పెడుతుంది. పుష్ప 2 ప్రీమియర్స్‌లో ఇదే జరిగింది. డిసెంబర్‌ 4న సినిమా చూడటానికి అల్లు అర్జున్‌ (Allu Arjun) సంధ్య థియేటర్‌కు వస్తే.. ఆయన్ను చూసేందుకు జనం విపరీతంగా వచ్చారు. 

తొక్కిసలాటపై తొలిసారి స్పందన
ఫలితంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణం పోగా ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ తొక్కిసలాటకు హీరో కూడా కారణమంటూ అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక రోజు తర్వాత బన్నీ జైలు నుంచి రిలీజై బయటకు వచ్చాడు. ఎనిమిది నెలల తర్వాత ఈ ఘటన గురించి హీరో మంచు విష్ణు (Vishnu Manchu) స్పందించాడు. 

అదే మాకు కిక్కిస్తుంది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. ఇప్పటికీ కేసు కోర్టులో నడుస్తున్నందున దీనిపై నేను పెద్దగా మాట్లాడలేను. కానీ, మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా ఈ ఘటనకు బన్నీ బాధ్యుడు కాడని మాత్రం చెప్పగలను. అతడు తనలా ఉండటమే తప్పయిపోయింది. ఆర్టిస్టులమైన మాకు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనిపిస్తుంది. జనాల రెస్పాన్స్‌ తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. అది మాకు కిక్‌ ఇస్తుంది. వింబుల్డన్‌ గెలిచినంత తృప్తిగా ఉంది.

అందుకేగా కష్టపడేది
మమ్మల్ని స్క్రీన్‌పై చూసి జనాలు అరుస్తుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? దానికోసమేగా మేము కష్టపడేది. ఆకలిని చంపుకుని డైట్‌ చేసేది, చెమటలు చిందించేది, రక్తాన్ని ధారపోసేది. ఏదేమైనా ఆరోజు ఓ అభిమాని మరణించడం దురదృష్టకరమే! కానీ, దానికి బన్నీని బాధ్యుడిని చేయడం మాత్రం తప్పు అని విష్ణు మంచు చెప్పుకొచ్చాడు.

చదవండి: రామ్‌చరణ్‌ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్‌ వెంకట్‌ 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)