Breaking News

హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?

Published on Mon, 01/06/2025 - 12:51

హీరో విశాల్‌ (Vishal) నటించిన సినిమా పుష్కరకాలం తర్వాత రిలీజవుతోంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్‌ 2012లోనే పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్‌ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేశారు.

వణికిపోతున్న విశాల్‌
ఈ కార్యక్రమానికి విశాల్‌ పంచెకట్టులో హాజరయ్యాడు. అయితే ఆయన బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. తను మైక్‌ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురూ చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్‌ ఈవెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

ఇంకేదైనా..?
ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్‌కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంత చిక్కిపోతారా? విశాల్‌ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విషయానికి వస్తే..
మదగజరాజ మూవీలో విశాల్‌ ఎయిట్‌ ప్యాక్స్‌లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్‌ సుందర్‌ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో వెల్లడించాడు. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్‌ షూట్‌ ఆలస్యమైంది. అయినా సరే విశాల్‌ తన ఎయిట్‌ ప్యాక్‌ బాడీని ఏడాదిపాటు మెయింటెన్‌ చేశాడు అని సుందర్‌ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్‌గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది.

 

 

 

చదవండి: 'గేమ్‌ ఛేంజర్‌' కోసం సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తా: దిల్‌ రాజు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)