Breaking News

మార్క్‌ ఆంటోని ట్విటర్‌ రివ్యూ.. విశాల్‌ సినిమాకు హిట్‌ టాక్‌!

Published on Fri, 09/15/2023 - 10:30

హీరో విశాల్‌ నటించిన మార్క్‌ ఆంటోని సినిమా ఎన్నో అడ్డంకులను దాటి నేడు(సెప్టెంబర్‌ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినయ, రీతూ వర్మ కథానాయికలుగా నటించగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు.  ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించాడు. ఈ మధ్యే జైలర్‌ సినిమాలో కామెడీ రోల్‌తో మెప్పించిన సునీల్‌ ఈ చిత్రంలోనూ కీ రోల్‌లో యాక్ట్‌ చేశాడు. చాలా చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలు పడటంతో సినీప్రియులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఈ సినిమాలోని పాత్రలన్నీ కార్తీ వాయిస్‌తో ఇంట్రడ్యూస్‌ అయ్యాయట. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కామెడీ, యాక్టింగ్‌ అదిరిపోయిందని టాక్‌. ఒంటిచేత్తో సినిమాను నడిపించేశాడని ట్విటర్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రారంభంలో, ముగింపులో.. దళపతి విజయ్‌కు, తలా అజిత్‌కు థ్యాంక్స్‌ కార్డ్‌ వేశారట.. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ అదిరిపోయిందని.. ఈ సినిమాతో విశాల్‌ సూపర్‌ హిట్‌ కొట్టాడని ట్వీ‍ట్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌, క్లబ్‌ సీక్వెన్స్‌, సిల్కు సీన్‌, క్లైమాక్స్‌లో ఫన్‌.. నెక్స్ట్‌ లెవల్‌లో ఉన్నాయంటున్నారు. సునీల్‌కు  మరోవైపు కొందరు మాత్రం సినిమా మరీ ఓ రేంజ్‌లో ఏమీ లేదని ఒకసారి మాత్రం చూడవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే సునీల్‌ ఈ మధ్యే కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మావీరన్‌ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. జైలర్‌తో మరోసారి ప్రేక్షకులకు టచ్‌లోకి వచ్చాడు. తమిళ సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చాడో, లేదో అప్పుడే అక్కడి నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సునీల్‌ చేతిలో ఈగై, బుల్లెట్‌, జపాన్‌ సహా పలు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో గుంటూరు కారం, పుష్ప 2, గేమ్‌ చేంజర్‌ సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్‌ బ్యాచ్‌ అవుట్‌.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్‌

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)