Breaking News

హీరోయిన్‌తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్‌

Published on Sun, 07/20/2025 - 13:50

అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే విశాల్‌ (Vishal) పెళ్లిపీటలెక్కేవాడు, కానీ దానికి మరికొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. హీరో విశాల్‌.. హీరోయిన్‌ సాయి ధన్సిక (Sai Dhanshika)ను ఇదివరకే ప్రేయసిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే! ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ ఓ ఈవెంట్‌లో బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ‍ప్రచారం జరుగుతోంది.

అదెప్పుడు పూర్తయితే అప్పుడే!
దీనిపై విశాల్‌ స్పందిస్తూ.. మా పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. నడిగర్‌ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశాను. ఇంకో రెండు నెలలు ఆగలేనా? నడిగర్‌ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్‌ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. 

ఆరోజు రెండు ప్రకటనలు
అయితే విశాల్‌ పుట్టినరోజయిన ఆగస్టు 29న రెండు గుడ్‌న్యూస్‌లు చెప్పనున్నాడట! ఒకటి నడిగర్‌ సంఘం భవంతి ప్రారంభోత్సవం గురించి, రెండోది తమ కొత్త పెళ్లి డేట్‌ గురించి! దీంతో ఆ రోజు కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నడిగర్‌ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం) భవన నిర్మాణం చాలామంది కల. ఈ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టారు. ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. 

సినిమా
దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు విశాల్‌. మొత్తానికి ఈ కల అతి త్వరలోనే పూర్తి కానుంది. సినిమాల విషయానికి వస్తే.. విశాల్‌ చివరగా మదగజరాజ మూవీతో అలరించాడు. ప్రస్తుతం తుప్పరివాలన్‌ 2 మూవీ చేస్తున్నాడు. సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాగా విశాల్‌కు గతంలో నటి అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లిపీటలెక్కడానికి ముందే ఎవరి దారి వారు చూసుకున్నారు.

చదవండి: సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)