Breaking News

కమెడియన్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా రికార్డ్!

Published on Thu, 09/12/2024 - 13:42

బాలీవుడ్ నటుడు వీర్‌ దాస్‌ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్‌ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్‌గా ఆయనను ప్రకటించింది.

గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్‌ ల్యాండింగ్‌కు గానూ వీర్ దాస్‌ అవార్డ్‌ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్‌ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.

(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్‌ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్‌)

కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్‌ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్‌గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ టూర్‌లో ఉన్న వీర్‌ దాస్‌ ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)