Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి
Breaking News
ఆ సినిమాల తర్వాత సంతాన ప్రాప్తిరస్తు: మధుర శ్రీధర్ రెడ్డి
Published on Sat, 11/15/2025 - 04:01
‘‘ఒక వినోదాత్మక మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్‌తో అర్థం అయింది. ‘ఆయ్, లిటిల్ హార్ట్స్’ వంటి చిత్రాల తర్వాత అలాంటి హోల్ సమ్ ఎంటర్‌టైనర్ మా ‘సంతాన ప్రాప్తిరస్తు’ అంటుండటం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విక్రాంత్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన వారు మా నటన, టెక్నీషియన్స్ వర్క్ గురించి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్‌కు వెళ్లి చూశాను.. ఆడియన్స్ స్పందన చూశాక సంతోషంగా అనిపించింది’’ అన్నారు చాందినీ చౌదరి. ‘‘కొత్త తరహా కంటెంట్ చూపిస్తే తాము ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అని సంజీవ్ రెడ్డి తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడారు.
Tags : 1