Breaking News

రెండు రోజుల క్రితమే సినిమాలకు గుడ్‌ బై.. అప్పుడే సెట్‌లో ప్రత్యక్షమైన హీరో!

Published on Thu, 12/05/2024 - 12:41

12th ఫెయిల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ చిత్రంలో రాశి ఖన్నా, రిద్ధి డోగ్రాతో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే విక్రాంత్ మాస్సే రెండు రోజుల క్రితమే సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

కానీ అంతలోనే ఓ మూవీ షూటింగ్‌ సెట్‌లో దర్శనమిచ్చాడు విక్రాంత్ మాస్సే.  ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్ షానాయ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నటనకు బ్రేక్..

ఇటీవల తాను సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2025 వరకు మాత్రమే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ తర్వాత తన పోస్ట్‌పై విక్రాంత్ వివరణ ఇచ్చాడు. పూర్తిగా సినిమాలు మానేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే కొన్ని రోజులు విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళనకు గురికావద్దని విక్రాంత్ కోరారు.

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)