Breaking News

సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్‌ ప్రకటించిన పాపులర్‌ హీరో

Published on Mon, 12/02/2024 - 09:18

బాలీవుడ్‌ నటుడు విక్రాంత్ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో ఆయన చేసిన పోస్ట్‌ అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 12th ఫెయిల్‌ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న ఆయన భవిష్యత్‌లో ఇక సినిమాలు చేయనని తెలిపారు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేశారు.

‘కొన్ని సంవత్సరాలుగా మీరు అందరూ నాపై చాలా ప్రేమను చూపించారు. ప్రతి ఒక్కరూ నాకు చాలా మద్దతు ఇచ్చారు.. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన టైమ్‌ వచ్చింది. దీంతో సినిమాలను అంగీకరించడం లేదు. కాబట్టి 2025లో రానున్న సినిమానే నా చివరి సినిమా అవుతుంది. చివరిసారిగా మనం కలవబోతున్నాం. చివరి రెండు సినిమాలతో నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు. విక్రాంత్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు'అని ఆయన ఒక పోస్ట్‌ చేశారు.

37 ఏళ్ల వయసులో విక్రాంత్  నటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఎందుకు అలా చేస్తావు.. ? నీలాంటి నటులు ఎవరూ లేరు. మాకు మంచి సినిమా కావాలి" అని తెలుపుతున్నారు. మరొకరు, అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో మీ కెరీర్‌ పరంగా పీక్‌లో ఉన్నారు...ఎందుకు ఇలా  నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నారు.

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన విక్రాంత్‌..  2017లో 'ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్‌ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్‌ అవార్డ్‌తో పాటు  'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌'గా కూడా గుర్తింపు పొందారు.

పర్సనల్‌ లైఫ్‌
విక్రాంత్‌, షీతల్‌ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు. 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)