Breaking News

'ఘాటి'తో విక్రమ్‌ కనెక్ట్‌ అవుతాడా.. భారీ అంచనాలతో అనుష్క

Published on Tue, 03/18/2025 - 07:00

దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి అనుష్క. తెలుగులో తొలుత కథానాయకిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా రాణించారు. మొదట్లో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్‌ను నమ్ముకున్న అనుష్కను అరుంధతి చిత్రం ఆమె కెరీర్‌నే మార్చేసింది. ఆ చిత్రంలో అనుష్క రౌద్రమైన నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాల విజయాలకు తన నటన అదనపు బలంగా మారింది. బరువు పెరగడం తదితర అంశాల కారణంగా సినిమాలు తగ్గాయనే చెప్పాలి. 

అనుష్క చివరిగా నటించిన చిత్రం మిస్‌శెట్టి మీస్టర్‌ పొలిశెట్టి 2023లో విడుదలై మంచి విజయాన్నే అందుకుంది. కాగా ఆ తరువాత రెండేళ్ల గ్యాప్‌ తరువాత అనుష్క నటించిన 'ఘాటి' చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీన్ని టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన వేదం చిత్రం 2010లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఘాటి చిత్రంతో ఈ కాంబో రిపీట్‌ కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. 

ఘాటి చిత్రం తమిళంతో పాటూ మలయాళం,తెలుగు, కన్నడం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. కాగా ఈ చిత్ర టైటిల్‌, టీజర్‌లు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. కాగా చిత్రాన్ని ఎప్రిల్‌ 18వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకటించిన ప్రకారం ఘాటి చిత్రం తెరపైకి వస్తుందా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం అంచనాలను అధిగమిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ 44 ఏళ్ల భామ తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కత్తనార్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)