Breaking News

19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?

Published on Mon, 05/13/2024 - 09:40

గత కొన్నాళ్ల నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి హిట్ చిత్రాల్ని మళ్లీ థియేటర్లకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'అపరిచితుడు' చేరింది. విక్రమ్‌, సదా జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్‌ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్‌ చూపించారు. హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్‌)

2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్‌ దర్శకత్వం, నటుడు విక్రమ్‌ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజాస్టర్‌ కారణంగా మామూలు మనిషి సూపర్‌ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్‌ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.

ఇకపోతే ఫ్రెంచ్‌ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్‌ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.

(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)