Breaking News

OTT: తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌

Published on Thu, 11/14/2024 - 18:42

తెలంగాణ నేపథ్యంలో ఓటీటీ కోసం మొదటిసారి ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతుంది.  డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్‌గా  'వికటకవి' అనే టైటిల్‌తో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌,ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పించింది. సుమారు నాలుగు దశాబ్ధాలుగా పట్టి పీడించే శాపానికి సంబంధించిన కథతో 'వికటకవి' వెబ్‌ సిరీస్‌ ఉన్నట్లు సమాచారం.

'వికటకవి' తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తెలంగాణ యాసతో, హైదారాబాద్ విలీనం తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలతో చాలా గ్రిప్పింగ్‌గా కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

స్వాతంత్య్రం రాక మునుపు మ‌న దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణ‌కు చెందిన అమ‌ర‌గిరి ప్రాంతం ఒక‌టి. రైట‌ర్ తేజ డిఫ‌రెంట్ క‌థ‌ను చెప్పాల‌నుకున్న‌ప్పుడు త‌న మైండ్‌లో వ‌చ్చిన ఐడియానే ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్న క్రమంలో కొన్నాళ్ల‌లో ఆ ప్రాంతంలోని ఒక ఊరు మునిగిపోతుంది.. ఈ బ్యాక్ డ్రాప్ క‌థ‌తో విక‌ట‌క‌వి అనే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌ను మేకర్స్‌ తీసుకున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)