Breaking News

విజయ్‌ స్పీడ్‌కు నో బ్రేక్స్‌.. అజిత్‌కు అన్నీ అడ్డంకులే

Published on Mon, 06/05/2023 - 15:28

హీరో అజిత్‌ కథానాయకుడిగా నటించిన తుణివు (తెగింపు) చిత్రం విడుదలై ఏడాదిన్నర కాబోతోంది. ఈ చిత్రంతో పాటు హీరో విజయ్‌ నటించిన వారీసు (వారసుడు) చిత్రం విడుదలైంది. కాగా విజయ్‌ తదుపరి చిత్రం ప్రారంభం కావడడంతో పాటు షూటింగ్‌కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే అజిత్‌ తాజా చిత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

(ఇదీ చదవండి: బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య)

ఆయన 62వ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ సిద్ధమైంది. ఇక సెట్‌పైకి వెళ్లటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేష్‌ శివన్‌ వైదొలిగారు. ఆయన స్క్రీన్‌ప్లే లైకా ప్రొడక్షన్స్‌ అధినేతకు, అజిత్‌కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని తెలిసింది. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్‌ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్‌ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది.

(ఇదీ చదవండి: శర్వానంద్‌ పెళ్లికి హాజరైన లవ్‌ బర్డ్స్‌.. సోషల్ మీడియాలో వైరల్!)

అజిత్‌ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్‌ వెల్లడించారు. దీంతో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అలాంటి సమయంలో విదేశీ బైక్‌ ప్రయాణానికి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్‌ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్‌ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్‌, దర్శకుడు మగిళ్‌ తిరుమేణి ప్రస్తుతం లండన్‌లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్‌ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్‌ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నట్లు సమాచారం.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)