తమన్నాతో డేటింగ్‌.. అప్పుడే మొదలైందన్న బాయ్‌ఫ్రెండ్‌!

Published on Sun, 03/24/2024 - 15:47

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జైలర్‌ మూవీలో స్పెషల్ సాంగ్‌తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్‌తో ‍అలరించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. అరణ్మణై- 4 అనే తమిళ చిత్రంతో పాటు స్ట్రీ-2 అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది తమన్నా తన బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మను అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నాతో డేటింగ్‌ ఎప్పుడు ప్రారంభించారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

విజయ్ వర్మ మాట్లాడుతూ..' తమన్నా, నేను డేటింగ్‌ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్‌-2 షూటింగ్‌లో కాదు. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ ‍కుదరలేదు. మేమే నలుగురం కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పా. ఆ తర్వాత మేం కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరు జంటగా నటించిన లస్ట్‌ స్టోరీస్-2 చిత్రంలో కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆ మూవీ సమయంలోనే డేటింగ్‌ ప్రారంభించారని ఫ్యాన్స్ భావించారు. కానీ తాజాగా ఈ విషయంపై విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. కాగా.. కొన్ని రోజుల క్రితమే విజయ్ వర్మ, తమన్నా భాటియా జంటగా ఓ పార్టీకి వెళ్తూ కనిపించారు.

కాగా.. కొత్త ఏడాదిలో విజయ్ వర్మ మర్డర్‌ ముబారక్‌ సినిమాతో అలరించాడు. గతేడాది జానే జాన్, దాహాద్, లస్ట్‌ స్టోరీస్‌-2 చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్‌లో విజయ్ వర్మ కథానాయకుడిగా కనిపించనున్నారు. వీరిద్దరు డేటింగ్‌ గురించి తెలిసినప్పటీ నుంచి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాదిలోనైనా వివాహాబంధంలోకి ‍అడుగుపెడతారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. ఇటీవలే పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను తన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)