Breaking News

జ్యోతిష్యుడు చెప్పాడని సినిమా నుంచి తొలగించారు: విజయ్‌ వర్మ

Published on Tue, 12/05/2023 - 15:52

తమన్నాతో లవ్‌ ట్రాక్‌ బయటపడిన తర్వాత బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ పేరు టాలీవుడ్‌లో కూడా మారుమోగింది. అంతకు ముందు నాని ‘ఎంసీఏ’ సినిమాలో నటించినా.. విజయ్‌కి అంతగా గుర్తింపు రాలేదు. కానీ తమన్నా ప్రియుడని తెలిసిన తర్వాత విజయ్‌ గురించి తెలుగు ప్రేక్షకులు ఆరా తీశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్‌ తొలినాళ్లలో విజయ్‌ చాలా అవమానాలకు గురయ్యాడట. అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్‌ అయ్యేవట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్‌..తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకున్నాడు.

బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వరకు ఎలాంటి కారణం లేకుండానే చేయి జారిపోయాయి. కెరీర్‌ ప్రారంభంలో ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కొన్ని ఫోటోలు కూడా పంపమని అడిగారు. హీరోగా సెలెక్ట్‌ చేసినట్లు కూడా చెప్పారు. కొన్నాళ్లకు నన్ను ఆ ప్రాజెక్ట్‌ నుంచి తీసేసినట్లు తెలిపారు.

(చదవండి: ఆ డైలాగ్‌ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్‌)

కారణం ఏంటంటే.. ఆ మూవీ దర్శకుడికి మూఢ నమ్మకాలు ఎక్కువ. తన జ్యోతిష్యుడు చెప్పాడని నన్ను సినిమా నుంచి తొలగించాడు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నటుడు నసీరుద్దీన్‌ షా నన్ను చాలా ఓదార్చాడు. ఆయన చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని ఆయన నాతో అన్నారు.

ఎప్పటికైనా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను.  ఇష్టం లేకపోయినా డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు కూడా చేశాను.అందిన అవకాశాలను వినియోగించుకొని నటుడిగా ఎదిగాను’అతని విజయ్‌ వర్మ చెప్పుకొచ్చాడు. షార్ట్‌ ఫిల్మ్‌ ‘చిట్టగాంగ్‌’(2008) తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌. అమితాబ్‌ బచ్చన్‌ ‘పింక్‌’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)