Breaking News

అకౌంట్‌లో రూ.18, సెట్‌లో రిజెక్ట్‌.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయా: నటుడు

Published on Fri, 11/24/2023 - 14:00

గల్లీ బాయ్‌, దహాద్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు విజయ్‌ వర్మ. అయితే సౌత్‌ ఇండస్ట్రీలో మాత్రం తమన్నా ప్రియుడిగానే ఎక్కువ ఫేమస్‌ అయ్యాడు. తాజాగా అతడు తను పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ వర్మ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో నేను ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను. అప్పుడు నా బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.18 ఉండేవి. ఆ సమయంలో నాకు మంచి అవకాశాలు కూడా రాలేదు. అప్పుడు నన్ను రిపోర్టర్‌గా చేయమని అడిగారు.

ఒక్క రోజే షూటింగ్‌, మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు. అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేకపోయినా డబ్బు కోసం ఒప్పుకున్నాను. మనసును బండరాయి చేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ ఆ రిపోర్టింగ్‌ కూడా ఇంగ్లీష్‌లో చేయమన్నారు. అది అంత ఈజీగా లేదు. దీంతో సెట్‌లోనే నన్ను రిజెక్ట్‌ చేశారు. అప్పటికే నేను మాన్‌సూన్‌ షూట్‌ అవుట్‌ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాను. అయినా సరే ఇలా చిన్నాచితకా పాత్రలు చేస్తూ చీవాట్లు తినాల్సిన దయనీయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ రోజు నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లాను. డబ్బు కోసం ఏది పడితే అది చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ సంఘటన 2014లో జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు డబ్బుల కోసం ఆలోచించడం మానేసి నాకు నచ్చిన పాత్రలు మాత్రమే చేసుకుంటూ వస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా విజయ్‌ వర్మ ప్రస్తుతం అఫ్గానీ స్నో, మర్డర్‌ ముబారక్‌తో పాటు సూర్య 43వ చిత్రంలోనూ నటిస్తున్నాడు.

చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? హంతకుడు దొరికినట్లే?! అమర్‌ మీద శివాజీ అక్కసు..

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)