Breaking News

ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Sat, 01/18/2025 - 18:58

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), స్టార్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో వచ్చిన విడుదల 1 ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్‌ 2. విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. 

ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉండనుంది. విడుదల పార్ట్‌ 1 కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే!

సినిమా కథ
ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌ (విజయ్‌ సేతుపతి) అరెస్టుతో విడుదల 1 కథ ముగుస్తుంది. జైల్లో ఉన్న పెరుమాళ్‌ విచారణతో విడుదల పార్ట్‌ 2 ప్రారంభమవుతుంది. పెరుమాళ్‌ అరెస్టు విషయం బయటకు తెలియడంతో అతడిని మరో క్యాంపుకు తరలించి అక్కడే ఎన్‌కౌంటర్‌ చేయాలని పథకం రచిస్తారు. కొమరన్‌ (సూరి)తో కలిసి మరికొంతమంది పోలీసులు పెరుమాళ్‌ను అడవి మార్గం గుండా క్యాంపుకు తీసుకెళ్తారు.

ఈ ‍ప్రయాణంలో పెరుమాళ్‌ తన ఫ్లాష్‌బ్యాక్‌ కథ చెప్తాడు. ప్రజాదళంలోకి ఎలా వచ్చాడు? అతడి ఆశయం ఏంటి? పార్ట్‌ 1లో జరిగిన రైలు ‍ప్రమాదం వెనక ఉన్న నిజమేంటి? పోలీసుల కస్టడీ నుంచి పెరుమాళ్‌ తప్పించుకున్నాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!

చదవండి: రామ్‌ చరణ్‌ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)