Breaking News

పరోటా మాస్టర్‌గా శిక్షణ తీసుకున్న విజయ్‌ సేతుపతి

Published on Tue, 02/25/2025 - 14:22

కోలీవుడ్‌ నటుడు విజయ్‌సేతుపతి ఇటీవల నటించిన చిత్రం మహారాజా. ఈయన నటించిన 50వ చిత్రం ఇది. ఆ మధ్య తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్‌ నిత్యామీనన్‌ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. 

(సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్‌: మీ అభిమాన తారలను నామినేట్‌ చేయండి)

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్‌ వినోద్‌ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ఇకపోతే ఇందులో నటుడు విజయ్‌సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. 

కాగా ఇంతకు ముందు నటుడు సూర్య హీరోగా ఎదర్కుమ్‌ తుణిందవన్‌ (తెలుగులో ఈటీ ) చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజా చిన్న గ్యాప్‌ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇకపోతే నటుడు విజయ్‌సేతుపతి ఈ చిత్రంతో పాటూ ఎస్, గాంధీ టాకీస్, మిష్కిన్‌ దర్శకత్వంలో ట్రైన్‌ మొదలగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)