Breaking News

విజయ్‌ సేతుపతి, రుక్మిణిలతో ప్రేమకథ

Published on Sat, 11/08/2025 - 06:50

మణిరత్నం తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారన్నది ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష  మల్టీస్టార్స్‌ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత రేంజ్‌లో విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న మణిరత్నం తాజాగా ఒక ప్రేమ కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఇందులో నటుడు దృవ్‌ విక్రమ్‌ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ కాంబినేషన్‌కు బ్రేక్‌ పడింది. 

దీంతో శింబుతో తెరకెక్కబోతున్నట్లు  వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే శింబు ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటిస్తున్న అరసన్‌ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా నటుడు విజయ్‌సేతుపతి ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతి ఇంతకు ముందు నవాబ్‌‌  అనే చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా రెండోసారి మణిరత్నం, విజయ్‌సేతుపతి కాంబో రిపీట్‌ కానుందన్నమాట. 

ఇకపోతే ఇందులో ప్రస్తుతం పుల్‌ ఫామ్‌లో ఉన్న నటి రుక్మిణి వసంత్‌ను నాయకిగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా రుక్మిణి వసంత్‌ కోలీవుడ్‌కు పరిచయమైంది విజయ్‌సేతుపతి హీరోగా నటించిన  ఏస్‌ ద్వారా అన్నది గమనార్హం. దీంతో ఈ కాంబో మరోసారి రిపీట్‌ కానుందన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా విజయ్‌సేతుపతి ప్రస్తుతం బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతోపాటు, తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)