Breaking News

కమర్షియల్‌ డైరెక్టర్‌తో విజయ్‌ సేతుపతి ఫస్ట్‌ సినిమా.. నిర్మాతగా నయనతార

Published on Wed, 12/25/2024 - 12:33

కోలీవుడ్‌లో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన హీరో, విలన్‌ అన్న తారతమ్యం లేకుండా పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్నారు. గత ఏడాదిలో 'జవాన్'‌ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌కు విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందే విజయ్‌ కథానాయకుడిగా నటించిన మాస్టర్‌ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి ఆ చిత్ర విజయంలో భాగమయ్యారు. ఇక ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా విడుదలై 2 చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 

ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రైన్‌, ఏస్‌, గాంధీ టాకీస్‌ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా మరో చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. కమర్షియల్‌ డైరెక్టర్‌గా పేరుగాంచిన హరి దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు హరి గతంలో సూర్యతో సింగం సీక్వెల్స్‌ చిత్రాలను తెరకెక్కించి హిట్‌ అందుకున్నారు. ఆపై హీరో విశాల్‌తో పూజై సినిమాతో బిగ్‌ హిట్‌ ఇచ్చారు. 

ఇప్పుడు విజయ​ సేతుపతితో సినిమా నిజమైతే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నటి నయనతార, విగ్నేష్‌ శివన్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థలో పలు వైవిద్య భరిత సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన నయనతార విగ్నేశ్‌ శివన్‌ లు తాజాగా విజయ్‌ సేతుపతి హీరోగా చిత్రం చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)