Breaking News

విజయ్‌ 'లియో' ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్‌

Published on Mon, 11/20/2023 - 11:39

విజయ్‌- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో లియో సినిమా తెరకెక్కింది. అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్‌లో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం కోలీవుడ్‌లో మాత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి.. విజయ్‌ కెరియర్‌లో మరో హిట్‌ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే కోలీవుడ్‌లో తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో లియో మేకర్స్‌ గ్రాండ్‌గా అభిమానుల మధ్య విజయోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు. 

తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్‌ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లియో స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రకటించారు.  తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లియో చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

కథేంటి?
పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్‌కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)