Breaking News

విజయ్ జన నాయగన్.. ఈ సారైనా మోక్షం లభించేనా?

Published on Mon, 03/16/2026 - 17:03

కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.

ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్  రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్‌ ప్రొడక్షన్‌కు స్క్రీనింగ్‌కు సంబంధించి అధికారిక  మెయిల్ అందినట్లు తెలుస్తోంది.

జన నాయగన్‌ను జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ  చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్  సర్టిఫికెట్‌ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు  సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

 ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్‌ బోర్డ్‌కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే.

 

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)