విజయ్ జన నాయగన్.. ‍అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్..!

Published on Wed, 07/22/2026 - 16:11

విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న తొలి సినిమా జన నాయగన్. రాజకీయాల్లో ఎంట్రీకి ముందు ఇదే చివరి సినిమా అని ‍ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఇ‍ప్పటికీ విడుదల కాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సెన్సార్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో జన నాయగన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్‌ కాగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే మూడు భాషల్లో కలిపి 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇ‍ప్పటికే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టికెట్ బుకింగ్ ప్రీ-సేల్స్‌లో అత్యధిక వాటా తమిళ వెర్షన్‌ కావడం విశేషం. 

ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్‌నిల్క్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది, అడ్వాన్స్ బుకింగ్‌లలో రూ. 7.90 కోట్లు రాబట్టింది. కర్ణాటక బెంగళూరులో రూ. 6.03 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద రూ. 1.91 కోట్లు వసూలు చేసింది. ఇక నగరాల విషయానికొస్తే బెంగళూరు రూ. 5.99 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చెన్నై (పరిమిత ఓపెనింగ్స్‌తో) రూ. 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. కోయంబత్తూరు రూ. 90 లక్షలతో మూడవ స్థానంలో ఉండగా,.. హైదరాబాద్, మదురై, కొచ్చి, తిరువనంతపురం తరువాత స్థానాల్లో నిలిచాయి. లియో, గోట్ సినిమాలతో పోలిస్తే.. జన నాయగన్ కాస్తా వెనకంజలోనే ఉంది.

కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నరైన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న విడుదల కానుంది. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)