Breaking News

విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?

Published on Sun, 12/07/2025 - 21:25

కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు హిట్ అని మేకర్స్ ఘనంగా చెప్పుకొంచారు. కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టేశాడు అని హడావుడి చేస్తారు. తీరా చూస్తే కొన్నిరోజులకు అసలు ఫలితం ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్‌ని వంకపెట్టడానికి ఏం లేనప్పటికీ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడంతో చాలావరకు ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది విజయ్ నుంచి 'కింగ్డమ్' వచ్చింది. మే చివరలో థియేటర్లలో రిలీజైంది.

(ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

విడుదల రోజు.. విజయ్ హిట్ కొట్టేశాడని రష్మిక పోస్ట్ పెట్టింది. తొలిరోజు మూవీ చూసిన చాలామంది కూడా బాగుందనే అన్నారు. కానీ రెండో రోజు నుంచి యావరేజ్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రూ.130 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. తొలి భాగంలో కొంత కథ చూపించారు. కాకపోతే పెట్టిన బడ్జెట్‌కి వచ్చిన వసూళ్లకు పొంతన కుదరలేదు. దీంతో ఇప్పుడు రెండో భాగాన్ని పక్కనబెట్టేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'కింగ్డమ్' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 'మ్యాజిక్' అనే చిన్న సినిమా తీశాడు. దీన్ని విడుదల చేసే పనుల్లో ఉన్నాడు. 'కింగ్డమ్' సీక్వెల్ లెక్క ప్రకారం వచ్చే ఏడాది మొదలవ్వాలి. కానీ అది ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది కొన్ని నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)