Breaking News

పుట్టినరోజు ప్రత్యేకం

Published on Sat, 05/10/2025 - 00:53

హీరో విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు డబుల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చారు మేకర్స్‌. విజయ్‌ నటించనున్న ‘వీడీ 14’, ‘ఎస్‌వీసీ 59’ సినిమాల కొత్తపోస్టర్స్‌ రిలీజ్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ధ్యానముద్రలో ఉన్న విజయ్‌ దేవరకొండపోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

‘‘బ్రిటిష్‌ కాలం నేపథ్యంతో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘వీడీ 14’. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగాపాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్‌ తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందనున్న 59వ చిత్రం ఇది. అందుకే ‘ఎస్‌వీసీ 59’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. విజయ్‌ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఓపోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ‘‘రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో ఈపాన్‌ ఇండియా సినిమాని రూపొందించనున్నాం. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని యూనిట్‌ తెలిపింది.

రౌడీ వేర్‌ లాభాల్లో సైన్యానికి విరాళం  
విజయ్‌ దేవరకొండకి క్లాత్‌ బ్రాండ్‌ ‘రౌడీ వేర్‌’ ఉన్న విషయం తెలిసిందే. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా మాత్రమే కాదు మేడ్‌ ఫర్‌ ఇండియా’ అంటూ రాబోయే కొన్ని వారాలపాటు ఈ రౌడీ వేర్‌ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత భారత సైన్యానికి విరాళంగా ఇవ్వనున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలిపారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు