Breaking News

కాశీనాథుని ఆలయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్‌ సతీమణి కూడా!

Published on Mon, 02/17/2025 - 16:53

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్‌ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్‌ రాజ్‌ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు.  అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్‌ రాసుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్‌ మూవీ కింగ్‌డమ్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి  గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే  టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్‌ను అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)