Breaking News

ఖుషి నుంచి రానున్న రెండో పాట.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published on Sat, 07/08/2023 - 19:36

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే..' సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయ్, సమంతల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇకపోతే లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ వదిలారు. ఖుషి చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో సమంత, విజయ్‌ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం(జూలై 10), ఫుల్‌ సాంగ్‌ను బుధవారం(జూలై 12) విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ 'ఆరాధ్య'తో మరోసారి 'ఖుషి' సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న సినిమాను విడుదల చేయబోతోన్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది.

చదవండి: ఎవరినైనా బాధపెట్టి ఉంటే సారీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)