కింగ్‌డమ్‌పై రష్మిక ట్వీట్.. ముద్దు పేరేంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!

Published on Sun, 07/27/2025 - 15:38

గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్‌ మూవీలో కనిపించనుంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో ఉన్న రిలేషన్‌పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్‌ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్‌ గురించి చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కింగ్‌డమ్‌ ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్‌, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్‌లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్‌తో పాటు ఎంజాయ్ ది కింగ్‌డమ్‌ అని ట్వీట్‌ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)