Breaking News

ఖుషి సినిమా ట్రైలర్‌: భర్తంటే ఎట్లుండాలో సమాజానికి చూపిస్తా!

Published on Wed, 08/09/2023 - 16:43

అన్నీ ప్రేమకథలే చేస్తే కిక్కేముంటుందని యాక్షన్‌ మోడ్‌ ట్రై చేశాడు విజయ్‌ దేవరకొండ. కానీ అది వర్కవుట్‌ కాకపోవడంతో తిరిగి లవ్‌ ట్రాక్‌ ఎక్కాడు. అటు శాకుంతలంతో ఫ్లాప్‌ మూటగట్టుకున్న సమంత కూడా లవ్‌ ట్రాక్‌నే నమ్ముకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ప్రేమకథలకు పెట్టింది పేరైన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు డైరెక్షన్‌ చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 'బేగంకు కవా చాయ్‌ అలవాటు అయినట్టు ఫ్యూచర్‌లో నేను కూడా అలవాటైపోతరా?' అని ఊహల్లో తేలిపోతుంటాడు విజయ్‌.

అప్పటివరకు ముస్లింగా కనిపించిన సామ్‌ సడన్‌గా తను బ్రాహ్మణురాలన్న నిజం చెప్తుంది. కానీ వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు చూపించారు. ఆ తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి. అప్పటిదాకా వారి మధ్య ప్రేమ మాత్రమే కనిపించగా తర్వాత కోపం, గొడవలు అన్నీ మొదలవుతాయి. వీటన్నింటినీ డైరెక్టర్‌ అందంగా చూపించాడు. 'పెళ్లంటేనే సావురా.. నువ్వెప్పుడో సచ్చిపోయినవ్‌.. డెడ్‌ మీట్‌ రిప్‌..', 'భర్త అంటే ఎట్లుండాలో సమాజానికి చూపిస్తా', 'మార్కెట్లో నా గురించి అట్ల అనుకుంటున్నరు కానీ, నేను స్త్రీ పక్షపాతిని' అంటూ వచ్చే డైలాగులు బాగున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు బాగా క్లిక్‌ అయ్యాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. ఖుషి సెప్టెంబర్‌ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

చదవండి: ఫస్ట్‌ డే బ్యాగేసుకుని స్కూలుకు వెళ్లిన అర్హ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)