Breaking News

తెలుగులో ఆ రెండు సినిమాలే నా ఫేవరేట్: విజయ్ దేవరకొండ

Published on Mon, 10/28/2024 - 16:45

టాలీవుడ్ హీరో విజయ్ దేవర ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. పరశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కేరళలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లిచూపులు హిట్ తర్వాత నా ఫస్ట్ చెక్‌ వచ్చింది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచే.. త్రివిక్రమ్ సార్‌ నన్ను ఆఫీస్‌కు పిలిచి అందించారు. ఆయనను కలవడం నా జీవితంలో బిగ్‌ మూమెంట్‌ అన్నారు. నా ఫేవరేట్ సినిమాలు మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అని విజయ్ తెలిపారు. ఎవరైనా ఖలేజా సినిమా బాగలేదంటే వారితో గొడవపడేవాడిని అని విజయ్ దేవరకొండ అన్నారు.

కాగా..వీడీ 12 తర్వాత మరో రెండు చిత్రాల్లో విజయ్ నటించనున్నారు. రాహుల్‌ సంకృత్యాన్, రవి కిరణ్‌ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్‌ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. వీడీ12 వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్‌ కానుంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)