Breaking News

'ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం'.. ఫ్యాన్స్‌ను తలచుకుని విజయ్ దేవరకొండ ఎమోషనల్

Published on Mon, 07/28/2025 - 22:56

విజయ్‌ దేవరకొండ హీరోగా వస్తోన్న యాక్షన్‌ మూవీ కింగ్‌డమ్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్విహంచారు. యూసుఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మరో రెండు రోజుల్లో థియేటర్‌లో కలుస్తాం. ఓవైపు టెన్షన్‌గా.. మరోవైపు హ్యాపీగా ఉంది. ఈ రోజు సినిమా కంటే మీ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు దేవుడిచ్చిన వరం. సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయినా మీ ప్రేమలో మార్పు ఉండదు. ఈ రోజు దాదాపు 2000 మంది ఫాన్స్‌ను కలిశా. అన్నా ఈసారి ‍మనం కొడుతున్నాం అన్నా.. మనం హిట్ కొడుతున్నాం.. టాప్‌లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం ఓన్‌ చేసుకుంటేనే వస్తుంది. ఎవరో కుంభమేళాకి వెళ్లి నా పోస్టర్‌తో మునిగి నేను హిట్ కొట్టాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతన్ని కలుస్తా. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్‌ అవుతుందో లేదో తెలియదు కానీ కానీ.. మీరు గౌరవించే సినిమాలే చేస్తా. వ్యక్తిగతంగా మీ అందరికీ నా వంతుగా ఏదో ఒక మంచి పని చేస్తా. ఈ రెండూ నా బాధ్యతలు' అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)