Breaking News

జన నాయగన్.. విజయ్ పారితోషికం అన్ని కోట్లా?

Published on Thu, 07/23/2026 - 16:30

రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

ఈ సినిమా రిలీజ్‌ వేళ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాకు దళపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్‌కు ఏకంగా రూ. 220 కోట్ల నుంచి రూ. 275 కోట్ల వరకు చెల్లించారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓ ఇండియన్ హీరోకు దక్కిన అత్యధిక పారితోషికాలలో ఒకటిగా నిలిచే అవకాశముంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.

మరోవైపు ఓ నివేదిక ప్రకారం దర్శకుడు హెచ్ వినోద్‌కు ఈ సినిమా కోసం రూ. 25 కోట్లు అందుకున్నారని టాక్. ఇదే నిజమైతే ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద పారితోషికం కానుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏకంగా రూ. 13 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్‌ పూజా హెగ్డేకు రూ. 6 కోట్ల వరకు ముట్టజెప్పారని సమాచారం.  విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్‌కు రూ. 5 నుంచి 10 కోట్ల మధ్య అందుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీతో ప్రకాష్ రాజ్ రూ. 5 కోట్లు సంపాదించగా.. ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌లకు చెరో రూ. 3 కోట్లు చెల్లించారని టాక్. ఈ మూవీ కోసం నరైన్ రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు చెబుతున్నారు.  మమితా బైజు రెమ్యునరేషన్ దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. అయితే ఈ పారితోషికాలపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. 
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)