ఓటీటీలోకి ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Published on Fri, 07/24/2026 - 17:26

బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.  భారీ అంచనాల మధ్య జూన్‌ 19న రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచి వసూళ్లతో పాటు ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. 

ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. విజయ్‌ ఆంటోని బర్త్‌డే సందర్భంగా ఈరోజు(జులై 24) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ వివరాలను పంచుకుంది. ఆగస్టులో తమ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 తెలుగు ప్రకటించింది.అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

వంద దేవళ్లు కథేంటంటే..
పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్‌ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్‌ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్‌(అజయ్‌ దిషాన్‌), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్‌ బీటెక్‌ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్‌ మాస్టర్‌ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్‌ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)