పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..!

Published on Wed, 03/25/2026 - 17:32

టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్‌ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్‌ ట్రిప్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లి తర్వాత మేమిద్దరంం రెండు రోజుల పాటు  వేకేషన్‌కు వెళ్లామని తెలిపింది. ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్‌లోని ప్రాంతం  మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది.  ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు అంటూ వీడియోను పోస్ట్ చేసింది. 

అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్‌ డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

 

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)