Breaking News

ప్రపంచంలో బెస్ట్ మదర్‌ నువ్వే.. భార్యకు విఘ్నేశ్ శివన్ విషెస్

Published on Sun, 05/14/2023 - 18:59

దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అంతలా స్టార్‌డమ్‌ తెచ్చుకున్న తెలుగు, తమిళ, మళయాళంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్‌ చిత్రంలో కనిపించనుంది. అగ్ర హీరోలతో జతకట్టిన నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్‌-విక్కీలు జూన్‌ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

(ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్!)

అయితే ఈ జంట గతేడాది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన తల్లితో దుబాయ్‌లో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. 

(ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక)

విఘ్నేశ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రియమైన నయన్ ... ఒక తల్లిగా నీకు 10కి 10 మార్కులు. నీ అపారమైన ప్రేమ, శక్తి నాకు రక్ష. నీకు మొదటి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఒక కల నిజమైంది. ఉయిర్, ఉలగం కవలలతో ఆశీర్వదించిన దేవుడికి నా ధన్యవాదాలు. యూ ఆర్ ది బెస్ట్ మదర్ ఇన్‌ ది వరల్డ్' అంటూ పోస్ట్ చేశారు. నయనతార పిల్లలను ఎత్తుకుని ఫోటోలను పంచుకున్నారు. ఆస్పత్రిలో తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నయన్ అరుదైన పిక్స్ మీరు చూసేయండి.

అలాగే తన తల్లి మీనాకుమారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నువ్వు చూపించిన ప్రేమ, అప్యాయతలే మా జీవితాన్ని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తకు ఎదిగేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి నువ్వే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు