ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
10 ఏళ్లుగా ట్రోలింగ్.. ధోనికే తప్పలేదు, ఇంకేం చేస్తాం!: విఘ్నేశ్
Published on Mon, 04/06/2026 - 10:11
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ పనేదో తాము చేసుకుని పోతారు, సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో తాము పెట్టే ఫోటోలు చూసి సంతోషపడేవారి కన్నా తిట్టుకునేవారే ఎక్కువయ్యారంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్.
నా ఆన్సరేంటంటే..
ఇతడు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. మన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఏం వస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి నా సమాధానమేంటంటే.. ఇప్పుడు నేను, నయనతార, మా పిల్లలతో కలిసి ఓ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశామనుకోండి.
అంతా మారిపోయింది!
కాస్త దిగులుగా, డల్‌గా ఉన్నవాళ్లు ఆ పిక్స్ చూసినప్పుడు కాస్త ప్రశాంతంగా ఫీల్ అవొచ్చు. కానీ ఇప్పుడంతా మారిపోయిందిలెండి. ప్రతీదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. నన్నయితే 10 ఏళ్లుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా ఎంఎస్ ధోనిలాంటివారికే ఈ విమర్శలు తప్పలేవు. గతంలో ఐపీఎల్‌లో సరిగా ఆడనప్పుడు ఆయన్ని ఎంత విమర్శించారో! ఇది చాలా బాధాకరం.. కానీ మనమేం చేయగలం?
నన్ను ఆడేసుకుంటున్నారు
ఇలాంటి కామెంట్లను లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేం. అప్పుడప్పుడూ ఈ ట్రోల్స్ గురించి నయన్, నేను సరదాగా మాట్లాడుకుంటాం. నిన్ను పెద్దగా ఏమీ అనట్లేదు కానీ నన్నయితే ఆడేసుకుంటున్నారు అని చెప్తుంటాను. ఇలా ట్రోల్స్ చేసేవారు ఎలాగో మారరు, కాబట్టి మనమే వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చాడు.
ప్రేమ- పెళ్లి
కాగా విఘ్నేశ్ శివన్ నానుమ్ రౌడీ ధాన్ (నేనూ రౌడీనే) సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2022 జూన్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.
చదవండి: నేను మంచివాళ్లకే మంచివాడిని.. అనవసరంగా నాలో రాక్షసుడిని నిద్రలేపొద్దు: బిగ్‌బాస్ పవన్
Tags : 1